Hyderabad: హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం

Hyderabad: మద్యం మత్తులో డ్రైవింగే కారణంగా తేల్చిన పోలీసులు * సీసీ కెమెరాల్లో కారు ప్రమాద విజువల్స్

Sandeep Eggoju
Published on: 27 Feb 2021 12:37 PM IST
Road Accident In Hasthinapuram Hyderabad
X

Road Accident In Hasthinapuram Hyderabad

Hyderabad: అదే తీరు అదే పోకడా పోలీసులు, స్వచ్చంద సంస్థలు ఎన్ని సార్లు హెచ్చరించినా.. అలానే ప్రవర్తిస్తున్నారు. కేసులు నమోదు అవుతున్నా.. డ్రైవింగ్ లైసెన్సులు రద్దు అవుతున్నా, జైలుకు వెళ్తున్నా కొంతమందికి బుద్దీ మాత్రం రావడం లేదు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని అనుక్షణం అప్రమత్తం చేస్తున్న అధికారుల విన్నపం ఎవరికీ పట్టడం లేదు. మద్యం మత్తులో వాహనాలు నడిపి మనుషుల ప్రాణాలు తీస్తున్నారు.. కొన్నిసార్లు వాహనం నడిపిన వారు ప్రాణాలు కోల్పోతున్నారు.

హైదరాబాద్‌ హస్తినపురంలో అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. మద్యం మత్తులో గౌతమ్ అనే యువకుడు డ్రైవింగ్ చేశాడు. స్పీడ్‌గా వెళ్లి ట్రాఫిక్ సిగ్నల్ స్తంభాన్ని ఢీ కొట్టిన కారు.. డివైడర్ పై నుంచి మరో పక్కికి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో వెనకాల కూర్చున్న సందీప్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి నుంచి మరో యువకుడు పారిపోయాడు. వాహనం నడిపిన గౌతమ్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. వాహన ప్రమాద విజువల్స్ సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. మద్యం మత్తులోనే ఈ ప్రమాదం జరిగిందని గుర్తించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story