క్షీణిస్తున్న వాతావరణంతో మానవజాతి అంతరించిపోయే ప్రమాదముంది

ఖైరతాబాద్‌ విశ్వేశ్వరయ్య భవన్‌లో నిర్వహించిన పర్యావరణ క్షీణత, సుస్థిర అభివృద్ధి సవాల్‌పై

admin1
Updated on: 22 Nov 2019 10:42 PM IST
srinivas goud
X
srinivas goud

క్షీణిస్తున్న వాతావరణంతో మానవజాతి అంతరించిపోయే ప్రమాదముందని తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. ఖైరతాబాద్‌ విశ్వేశ్వరయ్య భవన్‌లో నిర్వహించిన పర్యావరణ క్షీణత, సుస్థిర అభివృద్ధి సవాల్‌పై అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్న ఆయన రోజురోజుకూ పర్యావరణం కలుషితమవుతోందన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఆక్సిజన్‌ కొనుగోలు చేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. మానవజాతి అంతరించిపోయే ప్రమాదం పొంచి ఉందని అభిప్రాయపడ్డారు. కేసీఆర్‌ సీఎం అయ్యాక రాష్ట్రంలో పెద్దమొత్తంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారని... ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు.



admin1

admin1

Next Story