Ring Around Sun in Nizamabad : ఆకాశంలో అద్భుతం..సప్తవర్ణాలతో సూర్యుని చుట్టూ ఇంద్రధనస్సులా వృత్తం

Ring Around Sun in Nizamabad : ఆకాశంలో అద్భుతం..సప్తవర్ణాలతో సూర్యుని చుట్టూ ఇంద్రధనస్సులా వృత్తం
x
Highlights

Ring Around Sun in Nizamabad : అప్పుడప్పుడు ఆకాశంలో కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయి. వాటిని చూస్తే చాలు ఒళ్లు ఒక్కసారిగా పులకరించి పోతుంది.

Ring Around Sun in Nizamabad : అప్పుడప్పుడు ఆకాశంలో కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయి. వాటిని చూస్తే చాలు ఒళ్లు ఒక్కసారిగా పులకరించి పోతుంది. ఇలాంటి అద్భుతమే బుధవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆవిష్కృతమైంది. నీలాకాశంలో ఇంధ్రదనస్సులోని వర్ణాల రూపంలో ఆ సూర్యుని చుట్టూ ఓ సుందరమైన వలయం ఏర్పడింది. దీంతో ఆ అద్భుతమైన సుందర దృష్యం నిజామాబాద్ వాసుల్ని కనువిందు చేసింది. నిజామాబాద్ ప్రజలు ఈ దృశ్యాన్ని ఆసక్తిగా తిలకించారు. అయితే కొంత మంది పకృతి ప్రియులు ఈ అద్భుతమైన దృశ్యాన్ని తమ చరవానుల్లో భద్రపరచుకున్నారు. అంతే కాదు వాట్సాప్ స్టేటస్‌లు‌గా పెట్టుకున్నారు.

ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆకాశంలో మేఘాలు ఎక్కువగా ఉన్న సమయంలో వాటిలోని నీటి బిందువులపై పడిన కాంతి కిరణాలు వక్రీభవనం చెందడం వల్ల ఈ తరహా వలయాలు ఏర్పడతాయని వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు. అంతేకాక ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైన ఆ తరువాత వాతావరణం చల్లబడిన ప్రాంతాల్లో ఇలాంటి కొన్ని వలయాలు ఏర్పడుతుంటాయని కూడా ఖగోళ నిపుణులు స్పష్టం చేసారు. సముద్రాలు నదీ పరివాహక, ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా ఏర్పడతాయన్నారు. ఆకాశంలో సూర్యుడి చుట్టూ ఇంద్రధనస్సులా ఏర్పడిన ఈ సుందర వలయాన్ని 'హ్యాలో సినామినా' అని పిలుస్తారని అధికారులు తెలిపారు. సూర్యుడి చుట్టూ వలయం ఏర్పడి వాతావరణంలో మేఘాలు ఎక్కువగా ఉన్న సమయంలో వాటిలో నీటి బిందువులపై పడిన కాంతి కిరణాలు పరావర్తనం, వక్రీభవనం చెందడం ద్వారా ఈ తరహా వలయాలు ఏర్పడతాయని పేర్కొన్నారు. కొందరు తీసిన ఫొటోల్లో ఓ ప్రకాశవంతమైన చుక్క సూర్యుడిని దాటడం కూడా కనిపించింది.




Show Full Article
Print Article
Next Story
More Stories