ఆర్జీవీ సంచలన కామెంట్స్.. కేటీఆర్ సార్..5 లక్షల శునకాల మధ్యలో మేయర్ ను ఉంచండి..
Ram Gopal Varma: హైదరాబాద్‌లో కుక్కల బెడదపై దర్శకుడు ఆర్‌జీవీ సంచలన కామెంట్స్ చేశారు.
ఆర్జీవీ సంచలన కామెంట్స్.. కేటీఆర్ సార్..5 లక్షల శునకాల మధ్యలో మేయర్ ను ఉంచండి..
Ram Gopal Varma: హైదరాబాద్‌లో కుక్కల బెడదపై దర్శకుడు ఆర్‌జీవీ సంచలన కామెంట్స్ చేశారు. తన విన్నపాన్ని మంత్రి కేటీఆర్‌కు తెలిపారు. ఓ సామాన్య పౌరుడిగా తనకు పొలిటికల్ సిస్టం తెలియదంటూనే.. హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి ఇంట్లోకి కనీసం 5 వేల వీధి కుక్కల్ని వదలాలంటూ.. సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేశారు. చిన్నారిని చంపేసిన వీధి కుక్కల్లాంటి వాటిని మేయర్ ఇంట్లోకి వదలాలని, ఇంటి బయట నుంచి అన్నవైపుల డోర్లు మూసేసి, వాటికి తాళాలు వేయాలని ఆ వీడియోలో విన్నవించారు. అప్పడు ఆ కుక్కలపై ఆమె ఎలా ప్రేమ చూపిస్తు్ందో నేను చూడాలని, ప్రజలందరూ చూడాలని కోరారు. నా వినతిని మంత్రి మన్నించాలని కూడా ఆ వీడియోలో కోరారు. మేయర్ విజయలక్ష్మికి కూడా ఇదే విన్నవిస్తున్నానని తెలిపారు. మహిళలంటే తనకు గౌరవం అంటూనే.. మేయర్ అంటే ఏమాత్రం గౌరవం లేదని ఆ వీడియోలో తెలిపారు.


