Bichkunda: రేపు జుక్కల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి పర్యటన

S. Srikanth
Published on: 6 Feb 2020 6:26 PM IST
Bichkunda: రేపు జుక్కల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి పర్యటన
X

బిచ్కుంద: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపి రేవంత్ రెడ్డి బిచ్కుంద మండలం చిన్న దడ్గి మాజి సర్పంచ్ విఠల్ రెడ్డి కుమారుని వివాహానికి హాజరవుతున్న సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలకాలని పిట్లం జెడ్పిటిసి సభ్యుడు అరికెల శ్రీనివాస్ రెడ్డి కోరారు.

నిజాంసాగర్ మండలం నర్సింగ్ రావు పల్లి చౌరస్తా వద్ద, ఉదయం 9గంటలకు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ర్యాలీగా బయలు దేరి చిన్నదడ్గి గ్రామానికి చేరుకుంటారని పేర్కొన్నారు. నియోజకవర్గంలో మొట్టమొదటి సరిగా అడుగుపెట్టుతున్న రేవంత్ రెడ్డికి అందరు ఘన స్వాగతం పలకాలని తెలిపారు.


S. Srikanth

S. Srikanth

Next Story