సీఎం కేసీఆర్‌కు రేవంత్‌ బహిరంగ లేఖ.. వారికి రూ.10 లక్షలు ఇవ్వాల్సిందే

Revanth Reddy: సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.

Arun Chilukuri
Published on: 30 Dec 2021 7:03 PM IST
Revanth Reddy Open Letter To Cm KCR
X

సీఎం కేసీఆర్‌కు రేవంత్‌ బహిరంగ లేఖ.. వారికి రూ.10 లక్షలు ఇవ్వాల్సిందే

Revanth Reddy: సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల మరణమృదంగం మోగుతొందన్నారు. ఒకవైపు వరి రైతులు, మరోవైపు మిర్చి రైతుల ఆత్మహత్యలు కలచి వేస్తున్నాయని పేర్కొన్నారు. పంట నష్టపోయిన మిర్చి రైతులకు తక్షణం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తిరిగి పంట వేసుకోవడానికి విత్తనాలు, ఎరువులు ఉచితంగా ఇవ్వాలన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 10 లక్షల రూపాయలు చొప్పున పరిహారం ఇవ్వాలని, లక్ష రూపాయలు రుణమాఫీని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story