Revanth Reddy: నేడు కాంగ్రెస్ MLAలు, MLCలకు అవగాహన సమావేశం.. నిర్వహించనున్న సీఎం రేవంత్‌

Revanth Reddy: ఈ క్రమంలో ప్రజాప్రతినిధులకు అవగాహన తరగతులు

Shekhar G
Published on: 11 Feb 2024 10:00 AM IST
Revanth Reddy Meeting With MLAs And MLCs Today
X

Revanth Reddy: నేడు కాంగ్రెస్ MLAలు, MLCలకు అవగాహన సమావేశం.. నిర్వహించనున్న సీఎం రేవంత్‌

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇవాళ అవగాహన సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో గోదావరి, కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రాజెక్టులపై ప్రజా ప్రతినిధులకు అవగాహన కార్యక్రం ఏర్పాటు చేశారు. ప్రజాభవన్‌లో సాయంత్రం ఆరు గంటలకు ఈ సమావేశం నిర్వహించనున్నారు. రేపు అసెంబ్లీలో ఇరిగేషన్‌శాఖపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. ఈ క్రమంలో ప్రజా ప్రతినిధులకు అవగాహన తరగతులు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులకు సీఎం, డిప్యూటీ సీఎం, ఇరిగేషన్ మినిస్టర్ అవగాహన కల్పించనున్నారు.

Shekhar G

Shekhar G

Next Story