Revanth Reddy: అధికారం పోయినా అహంకారంతో మాట్లాడుతున్నారు
Revanth Reddy: రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ముట్టుకుంటే ఏమవుతుందో చూపిస్తాం
Revanth Reddy
Revanth Reddy: అధికారం పోయినా కొందరు అహంకారంతో మాట్లాడుతున్నారని, రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే తొలగిస్తామని అంటున్నారని ఫైర్ అయ్యారు సీఎం రేవంత్‌రెడ్డి. అధికారంలోకి వచ్చాక రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని తీసేస్తామంటున్నారని, డిపాజిట్లు కోల్పోయిన బీఆర్ఎస్.. మళ్లీ అధికారంలోకి వస్తుందా..? అంటూ ప్రశ్నించారు. రాజీవ్ విగ్రహాన్ని ఎప్పుడు తీసేస్తారో చెప్పండి.. మేమూ వస్తాం.. రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ముట్టుకుంటే ఏమవుతుందో చూపిస్తాం అంటూ సవాల్ విసిరారు. డిసెంబర్ 9లోపు సచివాలయం లోపలే తెలంగాణ తల్లి విగ్రహం పెడతామని ధీమా వ్యక్తం చేశారు సీఎం రేవంత్. ఇవాళ రాజీవ్ గాంధీ 80వ జయంతి సందర్భంగా.. సోమాజిగూడలో రాజీవ్ గాంధీ విగ్రహానికి సీఎం రేవంత్‌రెడ్డి నివాళులర్పించారు.
Next Story




