మంత్రి కేటీఆర్‌కు రేవంత్‌రెడ్డి సవాల్‌.. 24 గంటల కరెంట్‌ ఇవ్వట్లేదని నిరూపిస్తా..

Revanth Reddy: 24 గంటల విద్యుత్‌పై సీఎండీ క్లారిటీ ఇవ్వట్లేదు

Shekhar G
Updated on: 17 July 2023 6:16 PM IST
Revanth Reddy Challenge To Minister KTR
X

మంత్రి కేటీఆర్‌కు రేవంత్‌రెడ్డి సవాల్‌.. 24 గంటల కరెంట్‌ ఇవ్వట్లేదని నిరూపిస్తా.. 

Revanth Reddy: ఉచిత విద్యుత్ ఇష్యూ కేంద్రంగా.. తెలంగాణలో కరెంట్ మంటలు కొనసాగుతూనే ఉన్నాయి. బీఆర్ఎస్,కాంగ్రెస్ నేతల మధ్య సవాళ్ల పర్వం తారా స్థాయికి చేరింది. తాజాగా 24 గంటల ఉచిత విద్యుత్‌పై చర్చకు సిద్ధమా అంటూ మంత్రి కేటీఆర్‌కు సవాల్ విసిరారు టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఉచిత కరెంట్ పై చర్చకు కేటీఆర్‌ ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తామన్నారు రేవంత్‌. 24 గంటల విద్యుత్‌ ఇస్తున్నట్లు బీఆర్ఎస్ నేతలు బుకాయిస్తున్నారని.. 24 గంటల కరెంట్‌ ఇవ్వట్లేదని నిరూపించడానికి తాను సిద్ధమన్నారు రేవంత్ రెడ్డి..

Shekhar G

Shekhar G

Next Story