Revanth Reddy: ఇవాళ చలో రాజ్‌భవన్‌‌కు పిలుపునిచ్చిన టీపీసీసీ చీఫ్

* పెగాసస్ వివాదం నేపథ్యంలో రాజ్‌భవన్ ముట్టడి.. * పెగాసిస్ వివాదంపై సిటింగ్ జడ్జితో విచారణ చేయాలని డిమాండ్

Sandeep Reddy
Updated on: 22 July 2021 6:48 AM IST
Revanth Reddy Calls Chalo Raj Bhavan on July 22nd 2021 Because Of Pegasus Controversy
X

రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

Revanth Reddy: పెగాసస్ స్పైవేర్ హ్యాకింగ్ వివాదం నేపథ్యంలో ఇవాళ హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌ను ముట్టడించనున్నట్టు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. పెగాసస్ పై నిష్పక్షపాత విచారణకు వీలుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా రాజీనామా చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. పెగాసస్ సాప్ట్‌వేర్ వినియోగంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ లేదంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదులపై నిఘా వేసేందుకు ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసిన ఈ సాప్ట్‌వేర్‌ను ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేసేందుకు ప్రభుత్వం ఉపయోగిస్తోందని ఆరోపించారు. అందుకు నిరసనగా రాజ్‌భవన్‌ను ముట్టడిస్తామన్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story