తమది తోటికోడళ్ల పంచాయితీ.. పొద్దున తిట్టుకుంటాం మళ్లీ..

Congress: టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది.

Arun Chilukuri
Updated on: 2 Dec 2022 8:00 PM IST
Revanth Reddy and Jagga Reddy Funny Conversation At Assembly Premises
X

తమది తోటికోడళ్ల పంచాయితీ.. పొద్దున తిట్టుకుంటాం మళ్లీ..

Congress: టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో రేవంత్‌రెడ్డి, జగ్గారెడ్డి ఎదురుపడ్డారు. దీంతో ఇరువురు నేతలు షేక్‌ హ్యాండ్ ఇచ్చుకున్నారు. తమ మధ్య ఉన్నది తోటికోడళ్ల పంచాయితీ లాంటిదన్నారు.. పొద్దున తిట్టుకుంటాం.. మళ్లీ కలిసిపోతామన్నారు. రేవంత్‌ పాదయాత్రకు మద్దతు ఇస్తానని జగ్గారెడ్డి తెలిపారు. పదేళ్ల తర్వాత అయినా పీసీసీ అవుతానని జగ్గారెడ్డి ధీమాగా చెప్పారు.. ఒకరిని దింపి పీసీసీ కావడం కాంగ్రెస్‎లో సాధ్యంకాదన్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story