ఈనెల 28న రైతుబంధు నిధుల విడుదల

Rythu Bandhu: ఒకే రోజులో ప్రక్రియ పూర్తి చేయనున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం

Jyothi
Published on: 26 Nov 2023 9:34 AM IST
Release of Rythu Bandhu Funds on 28th of this Month
X

ఈనెల 28న రైతుబంధు నిధుల విడుదల

Rythu Bandhu: తెలంగాణలో యాసంగి సీజన్‌ కోసం రైతు బంధు నిధులు ఈనెల 28న విడుదల కానున్నాయి. పెట్టుబడి సాయం విడుదల కోసం ఎన్నికల కమిషన్‌ అనుమతి ఇచ్చినా ఇప్పటివరకు డబ్బులు జమ కాలేదు. శనివారం, ఆదివారం, సోమవారం సెలవు కావడంతో మంగళవారం డబ్బులు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈనెల 28నే రైతుబంధుకు గడువు ఉండటంతో అందుకు అనుగుణంగా శుక్రవారం 70 లక్షల మంది రైతుల జాబితాను సిద్ధం చేసి అధికారులు ఆర్థిక శాఖకు పంపారు. దీంతో మొత్తం 7 వేల 7 వందల కోట్లు పంపిణీ చేసేందుకు సిద్ధమైంది ప్రభుత్వం. మంగళవారం ఉదయం నుంచి కొన్ని గంటల వ్యవధిలోనే ఈ ప్రక్రియ ముగిస్తామని వ్యవసాయశాఖ కమిషనర్‌ తెలిపారు.

Jyothi

Jyothi

Next Story