TS News: ఇవాళ్టి నుంచి టీజీ కోడ్‌తో వాహనాల రిజిస్ట్రేషన్

Registration of vehicles with TG code from today
x

TS News: ఇవాళ్టి నుంచి టీజీ కోడ్‌తో వాహనాల రిజిస్ట్రేషన్

Highlights

TS News: కొత్త వాహనాల నెంబర్ ప్లేట్లపై టీజీ కోడ్

TS News: తెలంగాణలో ఇవాళ్టి నుంచి వాహనాల రిజిస్ట్రేషన్‌ టీజీ కోడ్‌తో జరగనుంది. కొత్త వాహనాల నంబర్‌ ప్లేట్లపై ‘టీజీ’ కోడ్‌ రానుంది. జిల్లాల నంబరు కోడ్‌లు పాతవే కొనసాగుతాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక వాహనాల రిజిస్ట్రేషన్‌ కోడ్‌ను టీఎస్‌ నుంచి టీజీకి మార్పు చేయాలని నిర్ణయించింది. ఆ మేరకు రాష్ట్ర కేబినెట్‌ తీర్మానం చేసి పంపగా, కేంద్ర ప్రభుత్వం ఈ నెల 12న గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చింది.

దీంతో జిల్లాల వారీగా రిజిస్ట్రేషన్‌ మార్క్‌ తో రాష్ట్ర ప్రభుత్వం గురువారం నోటిఫికేషన్‌ ఇచ్చింది. నూతన సీరీస్‌ను హైదరాబాద్‌ ఖైరతాబాద్‌లోని రవాణా శాఖ ప్రధాన కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఇవాళ సాయంత్రం ప్రారంభిస్తారని అధికారులు వెల్లడించారు.జిల్లాల కోడ్‌ల తర్వాత రవాణా వాహనాలు, ఆర్టీసీ బస్సుల సిరీస్‌ నిర్దేశిత అక్షరాలతో ప్రారంభమవుతుంది. రవాణా వాహనాలకు టీ, యూ, వీ, డబ్ల్యూ, ఎక్స్‌, వై సిరీస్‌ ఉంటాయి. ఆర్టీసీ బస్సులు ఎప్పటిలాగే ‘జడ్‌’ సిరీస్‌తో మొదలవుతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories