Hyderabad Red Alert: హైదరాబాద్‌కు రెడ్‌ అలర్ట్‌

Hyderabad Red Alert: మరికొద్ది గంటలు అతిభారీ వర్షాలు * హైదరాబాద్, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, రంగారెడ్డి..

Sandeep Eggoju
Updated on: 15 July 2021 1:03 PM IST
Red Alert in Hyderabad due to Heavy Rains
X
హైదరాబాద్ లో రెడ్ అలెర్ట్ (ఫైల్ ఇమేజ్)

Hyderabad Red Alert: భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న హైదరాబాద్‌కు.. రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇవాళ హైదరాబాద్ సహా మేడ్చల్, రంగారెడ్డి, యాదాద్రి జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు తెలిపింది. ఎనిమిది గంటల పాటు ఆయా జిల్లాల అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది భారత వాతావరణ శాఖ.

ఇప్పటికే రాత్రి నుంచి కురుస్తున్న వానలకు నగరం తడిసిముద్దైంది. లోతట్టు ప్రాంతాల్లో వరద ప్రవాహం మొదలైంది. వరదలతో కాలనీలు నిండిపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇవాళ కురిసే వానలకు లోతట్టు ప్రాంతాలకు ముంపు ముప్పు ఉందని హెచ్చరించింది వాతావరణ శాఖ.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story