Rave Party: జన్వాడ ఫామ్‌హౌస్‌లో రేవ్‌ పార్టీ..

Rave Party: జన్వాడ ఫామ్‌హౌస్‌లో రేవ్‌ పార్టీ జరిగింది. రాజ్‌ పాకాలకు ఫామ్‌హౌస్‌లో జరిగిన ఈ రేవ్‌ పార్టీకి పలువురు వీఐపీలు కూడా హాజరైనట్టు తెలుస్తోంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 27 Oct 2024 1:01 PM IST
Rave Party at Janwada Farm House
X

Rave Party: జన్వాడ ఫామ్‌హౌస్‌లో రేవ్‌ పార్టీ..

Rave Party: జన్వాడ ఫామ్‌హౌస్‌లో రేవ్‌ పార్టీ జరిగింది. రాజ్‌ పాకాలకు ఫామ్‌హౌస్‌లో జరిగిన ఈ రేవ్‌ పార్టీకి పలువురు వీఐపీలు కూడా హాజరైనట్టు తెలుస్తోంది. డీజే సౌండ్స్‌తో ఈ పార్టీని హోరెత్తిస్తున్న క్రమంలో పక్కా సమాచారం అందుకున్న సైబరాబాద్‌ ఎస్వోటీ పోలీసులు.. జన్వాడ ఫామ్‌హౌస్‌లో దాడులు నిర్వహించారు. రేవ్‌ పార్టీని భగ్నం చేశారు. విదేశీ మద్యం, లిక్కర్‌తో పాటు భారీగా డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు.

అలాగే.. క్యాసినో పరికరాలు, ప్లాస్టిక్‌ కాయిన్స్‌, ప్లేయింగ్‌ కార్డ్స్‌ను సీజ్‌ చేశారు. రేవ్‌ పార్టీలో పాల్గొన్న విజయ్‌ మద్దర్‌కు కొకైన్‌ టెస్ట్ చేయగా.. డ్రగ్‌ పాజిటివ్‌గా వచ్చింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. రేవ్‌ పార్టీలో పాల్గొన్న మహిళలు డ్రగ్‌ టెస్టులకు నిరాకరిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మోకిల పోలీస్‌ స్టేషన్‌లో విచారణ కొనసాగుతోంది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story