Rat in Chutney: చట్నీలో చిట్టెలుక

Rat in Chutney: సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్ జేఎన్టీయూ క్యాంపస్‌లోని హాస్టల్‌లో వండిన చట్నీలో ఎలుక ప్రత్యక్షమైంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 9 July 2024 1:17 PM IST
Rat Appears in Tiffin Chutney at Sangareddy JNTU
X

Sangareddy: జేఎన్టీయూ కాలేజీ క్యాంపస్ లో చట్నీలో ఎలుక

JNTU: సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్ జేఎన్టీయూ క్యాంపస్‌లోని హాస్టల్‌లో వండిన చట్నీలో ఎలుక ప్రత్యక్షమైంది. సోమవారం సాయంత్రం చట్నీలో ప్రాణాలతో ఉన్న ఎలుక ప్రత్యక్షమవడంతో విద్యార్థులు షాక్‌కు గురయ్యారు. ఈ ఘటనతో నాణ్యత లేని ఫుడ్‌కు హాస్టల్ కేరాఫ్ అడ్రస్‌గా మారుతుందని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

హాస్టల్‌లో నాణ్యమైన భోజనం అందించడంలేదని పలుమార్లు ఆందోళన చేసినప్పటికీ కాంట్రాక్టర్, సిబ్బంది తీరు మారడంలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలోనూ ఫుడ్ విషయంలో ఆందోళన చేస్తే నాణ్యమైన ఫుడ్ అందిస్తామని ప్రిన్సిపాల్ హామీ ఇచ్చినా మళ్లీ అలాంటి ఘటనే రిపీట్ అయిందని ఫైర్ అవుతున్నారు స్టూడెంట్స్.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story