ఫోక్ సింగర్ మల్లిక్ తేజ్ పై అత్యాచార కేసు

మాయమాటలు చెప్పి తనపై అత్యాచారం చేశాడని యువతి ఫిర్యాదు

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 29 Sept 2024 10:46 AM IST
Rape case against folk singer Mallik Tej
X

ఫోక్ సింగర్ మల్లిక్ తేజ్ పై అత్యాచార కేసు

జగిత్యాల జిల్లాలో ఫోక్ సింగర్ మల్లిక్ తేజ్‌పై అత్యాచార కేసు నమోదయ్యింది. మాయ మాటలు చెప్పి లొంగతీసుకొని అత్యాచారం చేసినట్లు ఓ యువతి ఫిర్యాదు చేసింది. బ్లాక్ మెయిల్ చేస్తూ పలుమార్లు అత్యాచారం చేశాడని.. ఫిర్యాదులో పేర్కొన్నారామె. తరచూ ఫోన్ చేసి వేధిస్తున్నాడని యువతి ఆవేదన వ్యక్తం చేసిందామె. బాధిత యువతితో పాటు కుటుంబ సభ్యులను దుర్భాషలాడిన సింగర్ మల్లిక్ తేజ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిందా యువతి. దీంతో కేసు నమోదు చేసిన జగిత్యాల పట్టణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story