మంత్రి కేటీఆర్ పేరు వాడుకుని క్రికెట్ ప్లేయర్ మోసాలు...

మంత్రి కేటీఆర్ పేరు వాడుకుని క్రికెట్ ప్లేయర్ మోసాలు...
x
Highlights

అతడు రంజీ ఆటగాడు క్రికెట్ లో ఒకప్పుడు మంచి ప్లేయర్ .. ఆ తరువాత ఆట పై శ్రద్ద కాస్తా దారి మళ్లింది. జల్సాలు లావాటుపడిన ఆటగాడు నేరాలు బాట పడ్డాడు.

అతడు రంజీ ఆటగాడు క్రికెట్ లో ఒకప్పుడు మంచి ప్లేయర్ .. ఆ తరువాత ఆట పై శ్రద్ద కాస్తా దారి మళ్లింది. జల్సాలు లావాటుపడిన ఆటగాడు నేరాలు బాట పడ్డాడు. ఇంకేమి ఏకంగా తెలంగాణా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పేరుని ఉపయోగించాడు ..కేటీఆర్ తెలంగాణ సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారని , ప్రమాణస్వీకారం సభలో కంపెనీకి స్పాన్సర్ షిప్ ఇస్తామంటూ గూగుల్ లో ప్రకటనలు చేశాడు .. ఇది నిజమేనని నమ్మి అడిగినంత డబ్బులు చెల్లించారు .. తీరా తాము మోసపోయామని తెలిసి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు ..

ఈ మధ్య కాలం రాజకీయ నాయకులు పేర్లు చెప్పి డబ్బులు దండుకుంటున్న సంఘటనలు తరుచు వెలుగు చూస్తున్నాయి.. మొన్నటికి మొన్న తాను కేటీఆర్ పీఏ నంటూ మీకు కావాల్సిన పని చేసిపెడుతానంటూ మోసం చేసిన ఘనుడు వ్యవహారం మరవక ముందే మరో సైబర్ నేరాగాడు తెలంగాణా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పేరును వాడుకున్నాడు . ఇదిగో మనం చూస్తున్న ఇతని పేరు నాగరాజు గతంలో ఏపీ రంజీ క్రికెట్ ప్లేయర్.. క్రికెట్ పై ఉన్న మక్కువతో ఎంతో కష్టపడి ఎదిగాడు .. కానీ అది కొద్దిరోజుల్లోనే చేయి జార్చుకున్నాడు .. ఏం చేయాలో దిక్కు తోచక నేరాల బాట పడ్డాడు .

నాగరాజు అనే ఏపీ మాజీ రంజీ క్రికెట్ ప్లేయర్ కేటీఆర్ పీఏ తిరుపతిరెడ్డి పేరు చెప్పి దందాలు మొదలు పెట్టాడు. ఫిబ్రవరి 9న కేటీఆర్ సీఎం కాబోతున్నారని, ఎల్బీ స్టేడియంలో ప్రమాణస్వీకారం చేస్తారని కూడా నమ్మించారు. 'నాగరాజు అనే నిరుపేద ప్లేయర్ ఇండియా టీమ్ అండర్ 25 వరల్డ్ కప్ మ్యాచ్, ఐపీఎల్ మ్యాచ్ లకు సెలెక్ట్ అయ్యడంటూ.. తన గురించే చెప్పుకుంటూ మోసం చేశాడు. సీఎం కేసీఆర్, కేటీఆర్ ల చేతుల మీదుగా కిట్లు అందిస్తామని ప్రైమ్ ఇండియా కంపెనీకి 3లక్షల టోకరా వేశాడు. దీంతో పాటు ఫిబ్రవరి 9 న కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్నారని.. ఎల్బీ స్టేడియంలో జరిగే ప్రమాణస్వీకారం సభలో స్పాన్సర్ షిప్ ఇపిస్తానని మరోసారి మోసానికి యత్నించాడు.

దీంతో నాగరాజు పేరును గూగుల్ లో సర్చ్ చేసి.. చీటర్ అని తెలుసుకున్న కంపెనీ యాజమాన్యం తాము మోసపోయామని తెలుసుకుంది. అనంతరం కంపెనీ ప్రతినిధులు హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అతనిపై నిఘా పెట్టి ఎట్టకేలకు నాగరాజును అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు. అయితే, నాగరాజు పలు ప్రాంతాల్లో ఉన్న కేసుల నిమిత్తం జైలుకు వెళ్లినట్టు పోలీసులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories