ఘనంగా హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవం

ఘనంగా హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవం
x
Highlights

హోమ్ గార్డ్స్ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా స్థానిక నిర్మల్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ సి.శశిధర్ రాజు అవగాహన కల్పించారు.

నిర్మల్: హోమ్ గార్డ్స్ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా స్థానిక నిర్మల్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ సి.శశిధర్ రాజు హోమ్ గార్డ్స్ గౌరవ వందనం తీసుకొని అనంతరం హోమ్ గార్డ్స్ యూనిట్ పతాకాన్ని ను ఎగుర వేసారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ హోమ్ గార్డ్ మొదట 1946 లో పూర్వపు బొంబాయి ప్రావిన్స్‌లో పెంచబడింది.

ఆర్మీ, నేవీ, వైమానిక దళం, ఇతర భద్రతా సంస్థలతో పాటు, అవాంఛనీయ పరిస్థి తుల్లో పౌరులకు రక్షణ కల్పించడానికి సివిల్ డిఫెన్స్ & హోమ్ గార్డ్స్ అనే జంట స్వచ్ఛంద సంస్థలుగా అప్పట్లో కేంద్ర హోం మంత్రిగా ఉన్న మొరార్జీ దేశాయ్ ఆలోచించి పెంచబడ్డాయి.

అందువల్ల ప్రతి సంవత్సరం డిసెంబర్ 6 న దేశ వ్యాప్తంగా సంస్థ యొక్క ఆవిర్భావ దినోత్సవం (రైజింగ్ డే) గా జరుపుకుంటారు. "నేర నియంత్రణలో, లా& ఆర్డర్, ట్రాఫిక్ నియంత్రణ, బ్లూ కోర్టు, పెట్రోల్ కార్, డ్రైవర్లు కార్యాలయాల భద్రత, రాత్రి గస్తీ, బందోబస్త్ లలో హోమ్ గార్డ్స్ యొక్క పాత్ర ఎంతో కీలక మైనది" అని కొనియాడారు. గతంలో హోమ్ గార్డ్స్, పోలీస్ లతో కలిసి చేసిన విధులను, పని తీరును అభినందించారు. అనంతరం హోమ్ గార్డ్స్ ఇటీవల నిర్వహించిన క్రీడా పోటీలలో విధుల నిర్వహణలో ప్రతిభ కనపరచిన వారిని అభినందించి పురస్కారం అందచేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories