Rakesh Tikait: టీఆర్‌ఎస్‌ పార్టీ బీజేపీకి కొమ్ముకాసే పార్టీ

Rakesh Tikait: కేంద్రంలో రాజకీయ పార్టీల ప్రభుత్వం ఉంటే చట్టం చేసే ముందు రైతులను సంప్రదించేదని...

Arun Chilukuri
Published on: 25 Nov 2021 4:23 PM IST
Rakesh Tikait Addresses Maha Dharna in Hyderabad
X

Rakesh Tikait: టీఆర్‌ఎస్‌ పార్టీ బీజేపీకి కొమ్ముకాసే పార్టీ

Rakesh Tikait: కేంద్రంలో రాజకీయ పార్టీల ప్రభుత్వం ఉంటే చట్టం చేసే ముందు రైతులను సంప్రదించేదని, కానీ మోడీది కంపెనీల ప్రభుత్వం కాబట్టి ఆ పని చేయలేదని విమర్శనాస్త్రాలు సంధించారు జాతీయ రైతు ఉద్యమ నేత రాకేష్ టికాయత్. హైదరాబాద్‌లో రైతు ఉద్యమం ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా మహా ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పాల్గొన్న టికాయత్ టీఆర్ఎస్‌, కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

టీఆర్ఎస్‌ పార్టీ బీజేపీకి కొమ్ముకాసే పార్టీ అని, వారిని తెలంగాణ దాటి బయటకు పంపకూడదని వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయ చట్టాల రద్దు కోసం సంప్రదింపుల సమయంలో రైతులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు పీఎంవో నుంచి వచ్చేవన్నారు. పీఎంవోకు నాగ్‌పూర్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకుల నుంచి సమాచారం వచ్చేదని చెప్పారు టికాయత్.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story