Telangana: ఇవాళ సచివాలయం ఎదుట రాజీవ్‌గాంధీ విగ్రహావిష్కరణ

Telangana: సా.4 గంటలకు విగ్రహాన్ని ఆవిష్కరించినున్న సీఎం రేవంత్‌

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 16 Sept 2024 8:18 AM IST
Rajiv Gandhi statue unveiling in front of Secretariat today
X

Telangana: ఇవాళ సచివాలయం ఎదుట రాజీవ్‌గాంధీ విగ్రహావిష్కరణ

Telangana: ఇవాళ సచివాలయం ఎదుట రాజీవ్‌గాంధీ విగ్రహావిష్కరణ జరగనుంది. సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్‌ రెడ్డి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. విగ్రహావిష్కరణ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని చెప్పగానే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్... ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది.

తాము తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలకు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. దీంతో అధికార,విపక్షాల మధ్య కొద్ది రోజలు రాజీవ్ విగ్రహ కేంద్రంగా మాటల యుద్ధం జరిగింది. మొత్తానికి ఇవాళ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story