Rains: హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షాలు.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌జామ్

Rains: అత్యవసరమైతే తప్ప బయటకి రావొద్దంటున్న అధికారులు

Shekhar G
Published on: 20 July 2023 5:32 PM IST
Rains Inundated Hyderabad
X

Rains: హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షాలు.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌జామ్

Rains: మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్‌ నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సికింద్రాబాద్‌, బేగంపేట, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, లక్డీకపూల్‌, నాంపల్లి, కోఠి, అమీర్‌పేట్‌, ఎస్సార్‌నగర్‌, కూకట్‌పల్లి, హైటెక్ సిటీ, మణికొండ, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌లో వర్షం కురుస్తోంది. చాలా చోట్ల వర్షపు నీరు రోడ్డుపైకి చేరింది. చాలా చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా ఆఫీసుల నుండి బయటకు వచ్చేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

భారీ ట్రాఫిక్ జామ్‌తో నగరవాసులు గంటల తరబడి రోడ్లపైనే వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోడ్డపై వర్షపు నీరు ఉండటంతో వాహనాలు మెల్లగా కదులుతున్నాయి. పలు ఏరియాలో వెహికిల్స్ రద్దీ పెరడగడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది.

Shekhar G

Shekhar G

Next Story