Telangana Rains: తెలంగాణలో నేడు, రేపు కూడా వర్షాలు

* నేడు తేలికపాటి నుంచి ఓ మాదిరి వర్షాలు * రేపు భారీ వర్షాలు పడే అవకాశం * గత రాత్రి కురిసిన వర్షానికి హైదరాబాద్ అతలాకుతలం

Sandeep Reddy
Updated on: 3 Sept 2021 9:36 AM IST
Rains in Telangana From 03 09 2021 to 04 09 2021
X

తెలంగాణలో నేడు, రేపు కూడా వర్షాలు (ఫోటో: ది హన్స్ ఇండియా)

Telangana Rains: తెలంగాణలో మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణశాఖ తెలిపింది. నేడు, రేపు రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. నేడు కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఓ మాదిరి వర్షాలు కురుస్తాయని, రేపు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ వివరించింది.

ఇక నిన్న తెలంగాణలోని పలుచోట్ల, హైదరాబాద్‌లో వర్షం దంచికొట్టింది. ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం లోకారి (కె)లో అత్యధికంగా 7.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. హైదరాబాద్‌లో గత రాత్రి ఏడున్నర గంటల నుంచి పదిన్నర గంటల వరకు మూడు గంటలపాటు ఏకధాటిగా కురిసిన వానకు జనజీవనం స్తంభించిపోయింది. రాజధాని హైదరాబాద్‌లో మూడు గంటల్లోనే ఏకంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story