Telangana Rain Alert: తెలంగాణలో వచ్చే 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం

Telangana Rain Alert: ఆయా జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలెర్ట్‌ జారీ

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 25 Sept 2024 9:46 PM IST
Heavy rains in Hyderabad
X

Heavy rains in Hyderabad

Telangana Rain Alert: తెలంగాణలో వచ్చే 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వాయువ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తుందని పేర్కొంది. గురువారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు భారీ వర్షాలు పడేందుకు అవకాశాలున్నాయని చెప్పింది. వరంగల్‌, హన్మకొండ, ఖమ్మం, మహబూబాబాద్‌, జనగాంతో పాటు పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story