Puvvada Ajay: ఖమ్మంలో కొంతమంది సైకోలుగా మారి.. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు

Puvvada Ajay Comments On Congress Leaders
x

Puvvada Ajay: ఖమ్మంలో కొంతమంది సైకోలుగా మారి.. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు

Highlights

Puvvada Ajay: ఈ సభ కూడా విజయవంతం అవుతుంది

Puvvada Ajay: రేపు జరిగే ప్రజా ఆశీర్వాద సభా ఏర్పాట్లు పూర్తయ్యాయని బిఆర్‌ఎస్‌ నేతలు తెలిపారు. ఖమ్మం నగరంలోని ఎస్‌ఆర్‌అండ్‌ బిజిఎన్‌ఆర్ కళాశాల మైదానంలో జరుగుతున్న సభ ఏర్పాట్లను మంత్రి అజయ్, ఎంపి నామా నాగేశ్వరావు,ఎమ్మెల్సీ తాత మధు పరిశీలించారు. ప్రజా ఆశీర్వాద సభలు ఎలా విజయవంతం అవుతున్నాయో...ఈ సభ కూడా విజయవంతం అవుతుందన్నారు. ఖమ్మంలో కొంతమంది సైకోలుగా మారి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ధ్వజమెత్తారు.

రాబోయే రోజుల్లో ఖమ్మం నగరంలో సైకోల కోసం పిచ్చి ఆసుపత్రి కట్టించి వారికి వైద్యం అందిస్తామన్నారు. ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల గ్రౌండ్ స్టేజ్ ఉందని, రేపు కేసీఆర్ ఆశీర్వాద సభకు అడ్డంగా ఉందని తొలగించడం జరిగిందన్నారు. మీటింగ్ అయిపోయిన తర్వాత మళ్లీ అదే స్థానంలో కట్టించి ప్రజలకు అందుబాటులో ఉంచుతామని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories