ఫుడింగ్ ఎండ్ మింగ్ పబ్ వ్యవహారంలో రోజుకో కొత్త కోణాలు.. వారి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు...

Pudding and Mink Pub: పబ్ కు కీ రోల్ గా ఉన్న అభిషేక్ ప్రొఫైల్ పై పోలీసుల దృష్టి...

Shireesha
Updated on: 6 April 2022 8:51 AM IST
Pudding and Mink Pub Case Latest News | Breaking News
X

ఫుడింగ్ ఎండ్ మింగ్ పబ్ వ్యవహారంలో రోజుకో కొత్త కోణాలు.. వారి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు...

Pudding and Mink Pub: హైదరాబాద్ లో సంచలనంగా మరీనా ఫుడింగ్ ఎండ్ మింగ్ పబ్ వ్యవహారంలో రోజుకో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి..పబ్ యజమాని ఉప్పల అభిషేక్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. ముందుగా నిబంధనలకు విరుద్దంగా పబ్ నడుస్తుందని భావించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు..డ్రైగ్స్ సప్లై జరుగుతుందన్న పక్కా ఇన్ఫర్మేషన్ తో డెకాయి ఆపరేషన్ నిర్వహించినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఈ కేసులో నలుగురు నిందితులను ఎఫ్ఐఆర్ లో చేర్చినప్పటికీ ఉప్పల అభిషేక్ పైనే ఎక్కువ ఫోకస్ చేశారు. ఉప్పల అశోక్ తో పాటు పబ్ మేనేజర్ అనిల్ ఇద్దరు మాత్రమే రిమాండ్ లో ఉన్నారు. మిగతా ఇద్దరు అర్జున్, కిరణ్ రాజ్ జాడ తెలియలేదు. వారి కోసం స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి గాలిస్తున్నారు పోలీసులు. సంచలనంగా మారిన ఈ కేసు మొత్తం అభిషేక్ చుట్టూ తిరుగుతోంది. అభిషేక్ పొలిటికల్ ఫ్యామిలి నుంచి వచ్చిన వ్యక్తి కావడంతో బడా బాబులు, తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన కొందరు హీరోలకుసైతం సన్నిహితుడుగా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

పబ్ లో జరిగిన బర్త్ డే పార్టీలో పాల్గొన్న యువతీ యువకులకు ఉప్పల అభిషేక్ డ్రగ్స్ తెప్పించినట్టు అనుమానిస్తు్న్నారు. ఎవరెవరు డ్రగ్స్ సేవించారన్నది తేల్చే పనిలో పోలీసులు నిమగ్నం అయ్యారు. బిగ్ బాస్ ఫేమ్ రాహుల్ సిప్లిగంజ్, నాగబాబు కూతురు నిహారిక సీన్ ఆఫ్ పొజిషన్ లో ఉండడం...వీరితో పాటు ఇతర వ్యాపార, రాజకీయ నేతలకు సంబంధించిన వారు ఉండడంతో అభిషేక్ నెట్ వర్క్ ఏంటి అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

అభిషేక్ రెగ్యులర్ ఆక్టివిటీస్ పై ఫోకస్ తో పాటు విఐపి, సెలెబ్రెటీల పరిచాయలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. కస్టడీకి న్యాయస్థానం అనుమతిస్తే అభిషేక్ నుండి మరింత కీలక సమాచారం, అంశాలు బయటకు వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే పబ్ లైసెన్స్ ను రద్దు చేసిన నేపథ్యంలో రాడిసన్ బ్లూ హోటల్ యాజమాన్యంతో అభిషేక్ కు ఉన్న పరిచయాలు, వారితో జరిపిన ఆర్ధిక లావాదేవీలు, ఇతరాత్ర అంశాలను తెలుసుకోవచ్చన్న బావనలో పోలీసులు ఉన్నారు. అభిషేక్ తో పాటు పబ్ మేనేజర్ అనిల్ కుమార్ కస్టడీపై ఇవాళ విచారణ జరిగే అవకాశం ఉంది.

Shireesha

Shireesha

Next Story