సికింద్రాబాద్‌ స్టేషన్ దగ్గర సైకో హల్ చల్

సికింద్రాబాద్‌ లో ఓ సైకో అరాచకం సృష్టించాడు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని కర్రతో దాడి చేశాడు. తల వెనక భాగాన ఒక్కసారిగా కొట్టాడు.

admin1
Updated on: 8 March 2020 10:33 PM IST
సికింద్రాబాద్‌ స్టేషన్ దగ్గర సైకో హల్ చల్
X
Psycho hulchul in Secunderabad

సికింద్రాబాద్‌ లో ఓ సైకో అరాచకం సృష్టించాడు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని కర్రతో దాడి చేశాడు. తల వెనక భాగాన ఒక్కసారిగా కొట్టాడు. దీంతో ఆ వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అలా పడ్డాక కూడా వదిలిపెట్టకుండా.. వెనక నుంచి బాడీపై ఇష్టానుసారంగా కొట్టాడు. అంతలోనే అటువైపు నుంచి మరో వ్యక్తి వచ్చి అదిలించగా.. అప్పుడా సైకో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సికింద్రాబాద్ మథర్స్ థెరిస్సా విగ్రహం వెనుక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి గోపాలపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ముందు.. ఈ ఘటన చోటు చేసుకుంది. వైజాగ్‌కు చెందిన రవీందర్ రెడ్డి.. సైకో కు బలయ్యాడు. అయితే ఆయన పరిస్థితి విషమంగా ఉందని.. కొట్టిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.



admin1

admin1

Next Story