KTR: అంబర్‌పేట్‌లో ఉద్రిక్తత.. కేటీఆర్‌ గో బ్యాక్‌ అంటూ నినాదాలు

KTR: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై కామెంట్స్‌ చేయొద్దని హెచ్చరిక

Shekhar G
Published on: 27 Feb 2024 4:03 PM IST
Protest Against Former Minister KTR In Amberpet
X

KTR: అంబర్‌పేట్‌లో ఉద్రిక్తత.. కేటీఆర్‌ గో బ్యాక్‌ అంటూ నినాదాలు

KTR: హైదరాబాద్‌ అంబర్‌పేట్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాజీమంత్రి కేటీఆర్‌కు నిరసన సెగ తగిలింది. అంబర్‌పేట్‌లో కేటీఆర్‌ను కాంగ్రెస్‌ నేతలు అడ్డుకున్నారు. కేటీఆర్‌ గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై కామెంట్స్‌ చేయొద్దని హెచ్చరించారు హస్తం పార్టీ నేతలు. గత పదేళ్లలో అప్పటి బీఆర్‌ఎస్‌ సర్కార్.. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఊసెత్తలేదని మండిపడ్డారు. ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ సర్కార్.. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేస్తుంటే.. ఓర్వలేక బీఆర్ఎస్‌ నేతలు పిచ్చికూతలు కూస్తున్నారని, ఖబడ్దార్‌ అంటూ హెచ్చరించారు.

Shekhar G

Shekhar G

Next Story