Shamshabad: శంషాబాద్ మర్డర్ కేసులో పురోగతి.. మృతురాలిని గుర్తించిన పోలీసులు

Shamshabad: నిందితుల కోసం కొనసాగుతోన్న పోలీసుల గాలింపు

Shekhar G
Published on: 12 Aug 2023 11:07 AM IST
Progress In Shamshabad Murder Case
X

Shamshabad: శంషాబాద్ మర్డర్ కేసులో పురోగతి.. మృతురాలిని గుర్తించిన పోలీసులు

Shamshabad: శంషాబాద్ మర్డర్ కేసులో మృతురాలు ఎవరనే సస్పెన్స్ వీడింది. శంషాబాద్‌లోని శ్రీనివాస నగర్‌లో గురువారం రాత్రి హత్యకు గురైన మహిళ.. రాళ్లగూడ దొడ్డికి చెందిన మంజులగా గుర్తించారు పోలీసులు. మొన్న వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లిన మంజుల.. తిరిగి ఇంటికి రాకపోవడంతో రూరల్ పోలీస్ స్టేషన్‌లో తన భర్త లక్ష్మయ్య ఫిర్యాదు చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో హత్య కేసులో పురోగతి సాధించిన పోలీసులు.. నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు మరింత ముమ్మరం చేశారు.

శంషాబాద్ శ్రీనివాస నగర్‌లో గుర్తు తెలియని వ్యక్తులు మహిళపై డీజిల్ పోసి నిప్పంటించారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు మొదలుపెట్టారు. సీసీ ఫుటేజ్‌ల ఆధారంగా ఇద్దరు వ్యక్తులు డీజిల్ కొనుగోలు చేసినట్లు గుర్తించిన పోలీసులు.. వారి కోసం నాలుగు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు.

Shekhar G

Shekhar G

Next Story