Professor Kodandaram: ప్రొఫెసర్ కోదండరాం గృహనిర్బంధం..!

Professor Kodandaram House Arrest At Tarnaka
x

Professor Kodandaram: ప్రొఫెసర్ కోదండరాం గృహనిర్బంధం..!

Highlights

Professor Kodandaram: ప్రజలకు నిరసన తెలిపే హక్కును కూడా ప్రభుత్వం హరిస్తుందని టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.

Professor Kodandaram: ప్రజలకు నిరసన తెలిపే హక్కును కూడా ప్రభుత్వం హరిస్తుందని టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. సడక్ బంద్ నేపథ్యంలో కోదండరాంను ఆయన ఇంటి దగ్గరే పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. వరుసగా పరీక్షల్లో వైఫల్యం చెందిన టిఎస్పిఎస్సి బోర్డును రద్దుచేసి, కమిటీ సభ్యులను తొలగించాలని డిమాండ్ చేశారు. వెంటనే నూతన బోర్డును ఏర్పాటు చేయాలని.. డీఎస్సీ పోస్ట్‌ల సంఖ్యను కూడా పెంచాలన్నారు. పరీక్షల రద్దు వల్ల ఎంతోమంది నిరుద్యోగ విద్యార్థులు నష్టపోయారని, వారందరికీ పరిహారంగా 3 లక్షలు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోదండరాం డిమాండ్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories