MLC Election Results: పోటీ నుంచి ప్రొఫెసర్ కోదండరాం ఎలిమినేట్

Professor Kodandaram Eliminated From MLC Counting
x

MLC Election Results: పోటీ నుంచి ప్రొఫెసర్ కోదండరాం ఎలిమినేట్

Highlights

MLC Election Results: తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు చివరిదశకు చేరుకుంది. నాలుగు రోజులుగా సాగుతున్న కౌంటింగ్ ప్రక్రియ క్షణక్షణం ఉత్కంఠ రేపుతోంది. రెండు స్థానాల్లో హోరాహోరీ పోరు కొనసాగుతోంది.

నల్గొండ, వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీ ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఫ్రొఫెసర్ కోదండరాం ఎలిమినేట్‌ అయ్యారు. ప్రస్తుతం టీఆర్ఎస్ అభ్యర్థి పల్లాకు లక్షా 22 వేల 639 ఓట్లు వచ్చాయి. తీన్మార్ మల్లన్నకు 99 వేల 207 ఓట్లు, ప్రొఫెసర్ కోదండరాంకు 89వేల 407 ఓట్లు పోలయ్యాయి. ప్రస్తుతం తీన్మార్ మల్లన్న రెండో స్థానంలో ఉండగా.. టీఆర్ఎస్‌ అభ్యర్థి 23 వేల 432 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానంలో ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. టీఆర్ఎస్ అభ్యర్ధి సురభి వాణిదేవికి 8,812 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. సురభి వాణికి ఒక లక్షా 28 వేల పది ఓట్లు రాగా బీజేపీ అభ్యర్ధి రామచంద్రరావుకు ఒక లక్షా 19 వేల 198 ఓట్లు వచ్చాయి. ప్రొఫెసర్ నాగేశ్వర్ కు 67 వేల 383 ఓట్లు పోలయ్యాయి. ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభం కావడంతో ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు ఓట్ల బదలాయింపు దాదాపు ఫలితాన్ని ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories