Siddipet: నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం

మండలంలోని లింగపూర్ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన అమరా మలేశం కొద్ది రోజుల ముందు మరణించారు.

S. Srikanth
Updated on: 9 April 2020 1:41 PM IST
Siddipet: నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం
X

మద్దూరు: మండలంలోని లింగపూర్ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన అమరా మలేశం కొద్ది రోజుల ముందు మరణించారు. ఈ రోజు వారి కుటుంబానికి దశదిన కర్మ సందర్భంగా బీజేపీ రాష్ట నాయకులు జనగామ కంటేస్టెడ్ ఎమ్మెల్యే ప్రొఫెసర్ జయశంకర్ సేవా సమితి చైర్మన్ కొత్తపల్లి సతీష్ కుమార్ 50 కిలోల బియ్యాన్ని సేవ సమితి కార్యకర్తలు వెళ్ళి అందించడం జరిగింది.

అనంతరం వారి కుటుంబసభ్యులు మాట్లాడుతూ కొత్తపల్లి సతీష్ కుమార్ అందించిన ఈ సహాయం మాకు సంతృప్తిని కలిగించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు తాడెం సతీష్ కుమార్, రాజుపేట మల్లేశం, జెల్ల శ్రీనివాస్ రమేష్, రాజబాబు, రాజశేఖర్, రమేష్ భాను, భూపతి రమేష్, తదితరులు పాల్గొన్నారు.



S. Srikanth

S. Srikanth

Next Story