Etela Rajender: ధరణి భూస్వాములకు మేలు చేసింది.. మళ్లీ కేసీఆర్‌ అధికారంలోకి వస్తే మన బతుకులు ఆగమే..

Etela Rajender: తెలంగాణ ప్రజల సమస్యలపై కేసీఆర్‌ దృష్టి పెట్టాలి

Shekhar G
Updated on: 27 Jun 2023 5:52 PM IST
Problems Of Tenant Farmers Should Be Solved
X

Etela Rajender: కౌలు రైతుల సమస్యలను పరిష్కరించాలి

Etela Rajender: ధరణి వచ్చాక పేదల భూములు మాయమయ్యాయని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. దేవాలయాలు, వక్ఫ్‌ భూములు కేసీఆర్‌ ఖాతాల్లోకి వెళ్లాయని విమర్శలు గుప్పించారు. ధరణితో భూస్వాములకే మేలు జరిగింది తప్ప... పేద రైతులకు జరగలేదన్నారు. ధరణి వచ్చాక బ్రోకర్లు పెరిగిపోయారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు డిపాజిట్‌ కూడా వచ్చే పరిస్థితి లేదని... కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి కేసీఆర్‌ గెలిస్తే మన బతుకులు ఆగమేనని ప్రజలు భావిస్తున్నారని ఈటల అన్నారు.

Shekhar G

Shekhar G

Next Story