Hyderabad: ఓ ప్రైవేట్ కాలేజీలో విద్యార్ధి ఆత్మహత్య.. కాలేజీ హాస్టల్ భవనం పై నుంచి దూకి...

Hyderabad: కాలేజ్ యాజమాన్యం వైఖరికి నిరసనగా విద్యార్ధి సంఘాల ఆందోళన...

Shireesha
Published on: 23 Dec 2021 3:23 PM IST
Private College Student Self Destruction in Hyderabad Today 23 12 2021 | Telangana News Today
X

Hyderabad: ఓ ప్రైవేట్ కాలేజీలో విద్యార్ధి ఆత్మహత్య.. కాలేజీ హాస్టల్ భవనం పై నుంచి దూకి...

Hyderabad: హైదరాబాద్ వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కాలేజీ విద్యార్ధి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న శివనాగు కాలేజీ హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా మృత దేహాన్ని తరలించారని బంధువులు ఆరోపిస్తున్నారు.

శివనాగు ఆత్మహత్యకు పాల్పడేంత పిరికి వాడు కాదని శివనాగు కుటుంబ సభ్యులు తెలిపారు. కాలేజీ యాజమాన్యమే సూసైడ్ నోట్ చిత్రీకరించారని ఆరోపించారు. శివనాగు ఆత్మహత్యను నిరసిస్తూ కాలేజీ విద్యార్ధులు, విద్యార్ధి సంఘం నేతలు కాలేజీ మెయిన్ గేట్ దగ్గర ఆందోళనకు దిగారు. కాలేజీ ఆవరణలోని కుండీలు ధ్వంసం చేశారు. పోలీసులు విద్యార్ధులపై లాఠీ చార్జ్ చేశారు.

Shireesha

Shireesha

Next Story