PM Modi: ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన షెడ్యూల్‌ ఖరారు

PM Modi: రేపు సాయంత్రం హైదరాబాద్‌లో రోడ్ షోలో పాల్గొననున్న మోదీ

Jyothi
Published on: 14 March 2024 12:41 PM IST
Prime Minister Modi Telangana Visit Schedule Finalized
X

PM Modi: ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన షెడ్యూల్‌ ఖరారు

PM Modi: తెలంగాణలో ప్రధాని మోదీ రెండు రోజల పాటు పర్యటించనున్నారు. రేపు సాయంత్రం 4 గంటల 50నిమిషాలకు బేగంపేట విమానాశ్రయానికి ప్రధాని చేరుకుంటారు. సాయంత్రం 5 గంటల15 నిమిషాల నుంచి 6 గంటల 15నిమిషాల వరకూ రోడ్ షోలో పాల్గొంటారు. సాయంత్రం 6 గంటల 40 నిమిషాలకు సోమాజిగూడ రాజ్ భవన్ కు చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు. 16వ తేదీ ఉదయం 10గంటల45 నిమిషాలకు రాజ్ భవన్ నుంచి బయలు దేరి 11గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.

అక్కడి నుంచి 11 గంటల 55 నిమిషాలకు నాగర్ కర్నూల్ చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు నాగర్ కర్నూలు లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. 12 గంటల 55 నిమిషాలకు నాగర్ కర్నూల్ లో హెలీప్యాడ్ కు చేరుకుంటారు. మధ్యాహ్నం ఒంటి గంటకు నాగర్ కర్నూల్ నుంచి గుల్బర్గా బయలుదేరి వెళతారు.

Jyothi

Jyothi

Next Story