హైదరాబాద్‌ కార్పొరేటర్లకు ఢిల్లీలో ప్రధాని దిశానిర్దేశం

PM Modi: *ప్రజా జీవితంలో ఆదర్శంతంగా ఉండాలని ప్రధాని సూచన

Sriveni Erugu
Published on: 8 Jun 2022 6:35 AM IST
Prime Minister direction in Delhi for the Hyderabad Corporators
X

హైదరాబాద్‌ కార్పొరేటర్లకు ఢిల్లీలో ప్రధాని దిశానిర్దేశం

PM Modi: ప్రధాని నరేంద్ర మోడీతో హైదరాబాద్‌ బీజేపీ కార్పొరేటర్లు సమావేశం అయ్యారు. నిన్న సాయంత్రం సుమారు గంటన్నరపాటు ఈ భేటీ కొనసాగింది. ఒక్కో కార్పొరేటర్‌ను పేరు పేరునా పరిచయం చేసుకున్న ప్రధాని.. వాళ్ల కుటుంబ పరిస్థితి, పిల్లల చదువుల గురించి అడిగి తెలుసుకున్నారు.

ప్రజా జీవితంలో ఆదర్శంతంగా ఉండాలని, రాబోయే ఎన్నికల కోసం తెలంగాణలో కష్టపడి పని చేస్తే అధికారం మనదే అని కార్పొరేటర్లకు ప్రధాని మోడీ సూచించారు. హైదరాబాద్‌ వచ్చినప్పుడు కలవలేకపోయా.. ఈసారి హైదరాబాద్‌కు వచ్చినప్పుడు కలుసుకుందామంటూ బీజేపీ కార్పొరేటర్లతో ప్రధాని చెప్పినట్లు తెలుస్తోంది. అనంతరం హైదరాబాద్‌ బీజేపీ కార్పొరేటర్లతో ప్రధాని మోదీ గ్రూప్‌ ఫొటో దిగారు. మొత్తానికి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు దక్షిణ భారతదేశంలో వేగంగా విస్తరించాలనుకుంటోంది. ఇప్పుడు గ్రేటర్ కార్పొరేటర్లను పిలిపించుకున్న అధిష్టానం.. జులై 2, 3 తేదీల్లో జాతీయ కార్యవర్గ సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహించాలనుకుంటోంది.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story