Hyderabad: వివాహేతర సంబంధం.. మహిళను హత్య చేసి.. మ్యాన్ హోల్‌లో దాచిపెట్టిన పూజారి

Arun Chilukuri
Updated on: 9 Jun 2023 1:34 PM IST
Priest Murders and Dumps in Man Hole in Hyderabad
X

Hyderabad: వివాహేతర సంబంధం.. మహిళను హత్య చేసి.. మ్యాన్ హోల్‌లో దాచిపెట్టిన పూజారి

Hyderabad: హైదరాబాద్ శంషాబాద్‌లో దారుణం జరిగింది. తనతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ అప్సరను శంషాబాద్ సమీపంలోని నర్కుడ వద్ద హత్య చేసిన నిందితుడు వెంకటసాయి సూర్యకృష్ణ. మృతదేహాన్ని సరూర్‌నగర్ వద్ద ఓ మ్యాన్ హోల్‌లో దాచిపెట్టాడు. తనను పెళ్లి చేసుకోవాలని మృతురాలు ఒత్తిడి చేయడంతోనే ఆమెను అడ్డు తొలగించుకోవడానికి పథకం పన్నాడు. సరూర్‌నగర్ నుంచి మహిళను కారులో ఎక్కించుకుని శంషాబాద్ సమీపంలోని నర్కుడ వద్దకు తీసుకొచ్చి తలపై బండరాయితో మోది హత్య చేశాడు.

అనంతరం మహిళ మృతదేహాన్ని ఓ కవర్‌లో కట్టి కారులో తీసుకెళ్లి సరూర్‌నగర్‌లోనే ఓ మ్యాన్‌హోల్‌లో పడేశాడు. తర్వాత తానేమీ ఎరుగనట్లు పోలీసులను తప్పుదారి పట్టించేలా నిందితుడు వ్యవహరించాడు. మహిళ అప్సర కనిపించడం లేదంటూ ఆర్‌జీఐఏ పోలీసు స్టేషన్‌లో నిందితుడు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి అసలు విషయాన్ని బయటపెట్టారు. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. కాగా ఈనెల 3న మహిళను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే పూజారి వెంకటసాయి సూర్యకృష్ణకు ఇదివరకే వివాహం జరగ్గా.. ఇద్దరు సంతానం ఉన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story