KCR: కేసీఆర్‌కు మరోసారి పవర్‌ కమిషన్‌ లేఖ

KCR: విద్యుత్ కొనుగోలు వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్‌కు పవర్‌ కమిషన్ మరోసారి నోటీసులు జారీ చేసింది.

Arun Chilukuri
Published on: 26 Jun 2024 10:33 AM IST
Power Commission Notice To KCR
X

KCR: కేసీఆర్‌కు మరోసారి పవర్‌ కమిషన్‌ లేఖ

KCR: విద్యుత్ కొనుగోలు వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్‌కు పవర్‌ కమిషన్ మరోసారి నోటీసులు జారీ చేసింది. కమిషన్ ఎదుట విచారణకు హాజరుకావాలని పవర్ కమిషన్ ఛైర్మన్ నర్సింహారెడ్డి లేఖ రాశారు. కమిషన్‌కు వచ్చిన సమాచారంపై అభిప్రాయాలు తెలపాలని ఈ నెల 19న కేసీఆర్‌కు లేఖ రాసింది పవర్ కమిషన్. ఈ నెల 27వ తేదీలోగా వివరణ ఇవ్వాలని కోరింది. అయితే తమకు వచ్చిన అభ్యంతరాలకు సంబంధించి ఏదైనా సమాచారం, అభ్యంతరమున్నా వివరణ ఇవ్వాలని లేఖలో కోరారు పవర్ కమిషన్ జస్టిస్ నర్సింహారెడ్డి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story