మాజీ ఎంపీ పొంగులేటి ఇంట కరోనా కలకలం

మాజీ ఎంపీ పొంగులేటి ఇంట కరోనా కలకలం
x
Highlights

Ponguleti Srinivas Reddy: తెలంగాణలో ప్రజాప్రతినిధులను కరోనా భయం వెంటాడుతోంది. ముఖ‌్యంగా అధికార టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలను కోవిడ్ కంగారు...

Ponguleti Srinivas Reddy: తెలంగాణలో ప్రజాప్రతినిధులను కరోనా భయం వెంటాడుతోంది. ముఖ‌్యంగా అధికార టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలను కోవిడ్ కంగారు పెడుతోంది. వరుసగా టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలకు కరోనా వైరస్ సోకుతుంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు కరోనా సోకగా తాజాగా ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు, టీఆర్ఎస్‌ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కరోనా కలకలం రేగింది. హైదరాబాద్ లోని తన నివాసంలో తనతోపాటు ఉంటున్న గన్ మన్ లకు, డ్రైవర్‌తో పాటు కొందరు కుటుంబ సభ్యులకు పాజిటివ్‌ వచ్చిందన్నారు. దీంతో వారందరికీ చికిత్స చేయిస్తున్నట్లు శనివారం ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. అయితే ఆయన ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉందన్నారు. అభిమానులు ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు. డాక్టర్ల సూచనల మేరకు హోమ్ క్వారంటైన్ లో ఉన్ననట్లుగా తెలిపారు పొంగులేటి. ప్రతి కార్యకర్తకు, అభిమానులకు ఫోన్ లో అందుబాటులో ఉంటానన్నారు.

తెలంగాణలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. మొత్తం కేసుల సంఖ్య 1,20,116కు చేరాయి. కరోనా మృతుల సంఖ్య 808కి చేరింది. ఇప్పటి వరకు మొత్తంగా 89,350 మంది డిశ్చార్జ్‌ అయినట్లు తెలంగాణ ఆరోగ్య శాఖ పేర్కొంది. ప్రస్తుతం 30,008 మంది చికిత్స పొందుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.



Show Full Article
Print Article
Next Story
More Stories