ఓటర్లు లేక కునుకు తీస్తున్న సిబ్బంది

Arun Chilukuri
Published on: 1 Dec 2020 4:45 PM IST
ఓటర్లు లేక కునుకు తీస్తున్న సిబ్బంది
X

గ్రేటర్ హైదరాబాద్‌‌లో పోలింగ్ అంత్యంత మందకొడిగా కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాలలో ఓటర్ల తాకిడి లేకపోవడంతో పలు ప్రాంతాల్లో సిబ్బంది కునుకు తీస్తూ కనిపించారు. అటు మరో రెండు గంటలు మాత్రమే ఓటు వేసేందుకు సమయం ఉన్న నేపథ్యంలో ఓటర్లు ఇంటి నుండి బయటకు రాని పరిస్థితులే ఇంకా కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య పోలింగ్ కేంద్రాల్లో సిబ్బంది కునుకు తీస్తూ కనిపిస్తున్నారు.

గ్రేటర్ హైదరాబాద్‌ ఓటర్లు ఓటేసేందుకు ఇంటి గేటు కూడా దాటడం లేదు. సాయంత్రం 4గంటల వరకు 25.34శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. పోలింగ్ మొదలై 9 గంటలు దాటిపోతున్నా పోలింగ్ కేంద్రాల వైపు కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదు. దాంతో, GHMC ఎన్నికల పోలింగ్ గతంలో ఎన్నడూలేనివిధంగా మందకొడిగా సాగుతోంది. సగానికి పైగా డివిజన్లలో మరీ దారుణంగా ఓటింగ్ పర్సంటేజ్ నమోదవుతోంది. ఓటేసేందుకు హైదరాబాదీలు అస్సలు ఆసక్తి చూపడం లేదు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story