గ్రేటర్ ఎన్నికల ఊహాగానంతో.. మొదలైన కోలాహలం!

గ్రేటర్ ఎన్నికల ఊహాగానంతో.. మొదలైన కోలాహలం!
x
Highlights

హైదరాబాద్ నగరంలో ఎన్నికల కోలహాలం మొదలైంది. ఎన్నికల కోసం అధికార విపక్షాలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే నవంబర్‌లో ఎన్నికల నోటిఫికేషన్...

హైదరాబాద్ నగరంలో ఎన్నికల కోలహాలం మొదలైంది. ఎన్నికల కోసం అధికార విపక్షాలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే నవంబర్‌లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న డివిజన్‌లపై మళ్లీ చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు ఉన్న 150 డివిజన్లలోనే ఎన్నికలు జరగుతాయా? లేదంటే డివిజన్‌ల సంఖ్య మళ్లీ పెంచుతారా? అన్న అంశం ఇప్పుడు ఆసక్తిగా మారింది.

తెలంగాణలో గ్రేటర్‌ ఎన్నికలకు కసరత్తు మొదలైంది. వార్డుల వారీగా ఓటర్ల జాబితా రూపకల్పనలో అధికారులు బిజీ అయ్యారు. ముఖ్యంగా రిజర్వేషన్ల స్థానాలు మారనున్నాయి. జనాభా ఆధారంగా వీటిని ఖరారు చేయనున్నారు. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న 150 డివిజన్లలో ఎన్నికలు జరగుతాయా లేక డివిజన్ ల సంఖ్యను పెంచుతారా అనేది చర్చ జరుగుతుంది.

మొదట మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్‌గా ఉన్న ఈ నగరం 2009 లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌గా రూపాంతరం చెందింది. అప్పటి వరకు ఉన్న 100 వార్డులను 150 వార్డులుగా విభజించారు. ఈ 150 డివిజన్‌ల్లో రెండు టర్మ్‌లుగా ఎన్నికలు జరిగాయి. అయితే 2016లో గ్రేటర్ ఎన్నికల సమయంలో వార్డుల సంఖ్య పెంచేందుకు కసరత్తు జరిగింది. జిహెచ్‌ఎంసిలో 200 వార్డులు ఏర్పాటు చేయాలంటూ మొదట ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. వార్డుల సంఖ్య ఎక్కువైతే పాలనాపరమైన సమస్యలు ఉత్పన్నమవుతాయని అప్పట్లో విభజన నిలిపి వేశారు. దీంతో వార్డుల పునర్విభజన యోచనకు తెరపడింది. మొత్తంగా ప్రస్తుతం ఉన్న వార్డుల సంఖ్యను యథాతథంగా కొనసాగిస్తూ ఈ 150 వార్డుల లోనే ఎన్నికలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories