గ్యాంగ్ రేప్‌ ఘటనలో భయంగొలిపే వాస్తవాలు

గ్యాంగ్ రేప్‌ ఘటనలో భయంగొలిపే వాస్తవాలు
x
Highlights

హైదరాబాద్ లో దిశ ఘటన మన కనుల ముందు ఇంకా కదులాడుతూనే ఉంది. ఈ ఘోరం తెలుగు రాష్ట్రాలతోపాటు యావత్ దేశాన్ని కంటతడి పెట్టించింది. అంతటి దారుణ ఘటనను...

హైదరాబాద్ లో దిశ ఘటన మన కనుల ముందు ఇంకా కదులాడుతూనే ఉంది. ఈ ఘోరం తెలుగు రాష్ట్రాలతోపాటు యావత్ దేశాన్ని కంటతడి పెట్టించింది. అంతటి దారుణ ఘటనను మరువకముందే మరో ఘోరం హైదరాబాద్ ప్రజానీకాన్ని ఒక్కసారిగా భయభ్రాంతులకు గురిచేసింది. ఘట్ కేసర్ లో ఫార్మసీ విద్యార్థినిపై జరిగిన గ్యాంగ్ రేప్ ఘటన భాగ్యనగర ప్రజల్లో మరోసారి భయాన్ని రేకెత్తించింది. ఇంటి నుంచి బయటకు వెళ్లే మహిళలు, విద్యార్థినులు ఏ విధంగా తిరిగివస్తారో అసలు తిరిగి వస్తారోరారో కూడా తెలియని పరిస్థితులు నెలకొన్నాయి.

ఘట్‌కేసర్ గ్యాంగ్‌ రేప్‌ ఘటనలో భయం గొలిపే విషయాలు వెలుగు చూస్తున్నాయి. నిందితుల విచారణలో పోలీసులకే దిమ్మతిరిగే విషయాలు తెలిశాయి. మనుషుల్లో ఇలాంటి మృగాలు కూడా ఉంటాయా అన్నంతగా ఒక్కో అంశం గగుర్పాటుకు గురిచేస్తుంది. కిడ్నాప్ తర్వాత కిరాతకులు యువతికి మత్తు మందు ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా గతంలోనూ ఆ కిరాతకులు ఇలాంటి నేరాలు మరిన్ని చేసినట్లు తెలుస్తోంది.

నిందితుల నేర చరితపై రాచకొండ పోలీసులు ఆరా తీయగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒంటరిగా కాలేజీలకు, ఆఫీసులకు వెళ్లే మహిళలను టార్గెట్ చేసేవారని తేలింది. నలుగురు కలిసి ఆటోలో తీసుకెళ్లి అత్యాచారం చేసేవారని, విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించేవారని వెల్లడైంది. ఈ విధంగా గతంలో ఐదుగురిపై అఘాయిత్యానికి పాల్పడినట్టుగా గుర్తించారు. ఇక, ఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్ అండ్ రేప్‌ కోసం ముందుగానే పథకం వేసినట్టుగా తెలిపారు. విద్యార్థిని రోజు కాలేజీ బస్సు దిగి రాంపల్లి చౌరస్తా దగ్గర ఆటో ఎక్కుతుండటం నిందితులు గమనించారు.

మరోవైపు యన్నంపేటకు చెందిన ప్రధాన నిందితుడు రాజు ఆ అమ్మాయిపై వారం రోజులుగా కన్నేశాడు. ఆమె తిరిగొచ్చే సమయానికి తన ఆటో తీసుకొని స్టేజీ వద్దకు వస్తున్నాడు. చౌరస్తాలో ఉన్న అడ్డాలో నిందితుడు ఆటోను ఉంచడంతో విద్యార్థిని పలుమార్లు ఆ ఆటోలో ప్రయాణించింది. అదును చూసుకుని విద్యార్థిని ఆటోలో ఎక్కించుకున్న నిందితుడు ఆమె దిగాల్సిన స్టాప్ దగ్గర ఆపకుండా వేగంగా ముందుకు పోనిచ్చాడు. యన్నంపేట దగ్గరకు రాగానే మరో ఇద్దరు నిందితులు ఆటో ఎక్కారు.

ఒంటరి విద్యార్థినిపై కర్కశంగా వ్యవహరించారు. యువతి అరవకుండా ఇద్దరు కిరాతకులు నోరు నొక్కి పట్టుకున్నారు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో రాడ్లతో కొట్టారు. అప్పటికే సిద్ధం చేసిన మారుతి వ్యాన్ లోకి ఎక్కించి అక్కడి నుంచి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు టీములుగా ఏర్పడి చుట్టూ పాకాల ప్రాంతాల్లో సైరన్ మోగిస్తూ వెతికారు. పోలీసుల గాలింపుతో భయపడిపోయిన నిందితులు బాధితురాలిని అక్కడే వదిలేసి పరారయ్యారు. సీసీ కెమెరాలు, తోటి ఆటో డ్రైవర్లను విచారించడం ద్వారా నిందితులను గంటల వ్యవధిలోనే అరెస్టు చేశారు పోలీసులు. పోలీసుల రాక ఏమాత్రం ఆలస్యమైనా మరింత ఘోరం జరిగేదని భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories