Mancherial: గన్ ఫైరింగ్ కేసు చేధించిన పోలీసులు.. పిస్టల్, ఆరు బుల్లెట్లు స్వాధీనం

Mancherial: కాల్పులకు పాల్పడిన నరేందర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

Shekhar G
Updated on: 2 March 2024 5:30 PM IST
Police Solved Gun Firing Case In Mancherial District
X

Mancherial: గన్ ఫైరింగ్ కేసు చేధించిన పోలీసులు.. పిస్టల్, ఆరు బుల్లెట్లు స్వాధీనం

Mancherial: మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలంలోని సాలిగాం గ్రామంలో గత నెల 27న అత్తమమామలపై గన్ ఫైరింగ్ చేసిన కేసును పోలీసులు ఛేదించారు. సొంత అల్లుడు గోమాసం నరేందర్ కాల్పులకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. కట్నం విషయంలో తెలత్తిన విభేదాలతో అత్తమామలపై కోపం పెంచుకున్న నరేందర్ ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలిపారు. బెల్లంపల్లి మండలం మాలగురజాల గ్రామానికిచెందిన నరేందర్ అత్తమామలను చంపేందుకు బీహార్ లో పిస్టల్ కొనుగోలు చేసి మహేష్ తో కలిసి కాల్పులకు పాల్పడినట్టు చెప్పారు. ఆ తర్వాత మాలగురజాల గ్రామంలోనే ఉన్న నరేందర్ కరీంనగర్ వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. మరో వ్యక్తి మహేష్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు నరేందర్ నుండి 9MM పిస్తోల్ ,6 బుల్లెట్లు, ఒక బైకు, ఒక సెల్ ఫోన్, స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

Shekhar G

Shekhar G

Next Story