కంటినిండా నిద్ర లేదు.. కడుపునిండా తిన్నదీ లేదు

కంటినిండా నిద్ర లేదు.. కడుపునిండా తిన్నదీ లేదు
x
Highlights

కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి వైద్యులతో పాటు పోలీస్ అధికారులు అహర్నిశలు ఎంతగా శ్రమిస్తున్నారో అందరికీ తెలిసిందే.

కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి వైద్యులతో పాటు పోలీస్ అధికారులు అహర్నిశలు ఎంతగా శ్రమిస్తున్నారో అందరికీ తెలిసిందే.వైద్యులు కరోనా బాధితులకు వైద్యం చేసి వారి ప్రాణాలను కాపాడుతుంటే, పోలీసులు విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి వివరాలు సేకరించి అధికారులకు తెలియజేసే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్క పోలీస్‌ స్టేషన్‌ నుంచి ఓ ఎస్‌ఐని విదేశాల నుంచి వచ్చిన వారి కాంటాక్ట్స్‌ను, వారు ఎవరెవర్ని కలిశారు? ఎక్కడెక్కడ తిరిగారు అనే వివరాలను తెలుసుకోవడానికి నియమించారు. అధికారులు అప్పగించిన ఈ పనులను పోలీసులు సమగ్రవంతంగా పూర్తి చేసి సమగ్ర సర్వే చేసి ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తున్నారు.

ఇందులో భాగంగానే ఓ ఎస్సై సుమారుగా 100 రోజులుగా అధికారులు అప్పగించిన పనులను ఎంత కష్టమైనా చేస్తున్నారు. నారాయణగూడ పోలీస్‌ స్టేషన్‌లో ఇటీవల బదిలీపై వచ్చిన ఓ ఎస్‌ఐని మార్చి 23వ తేదీన నుంచి కోవిడ్‌ ఇన్‌చార్జిగా ఎస్‌హెచ్‌ఓ నియమించారు. దీంతో ఆ ఎస్సై చాలా ప్రాంతాల్లో తిరగాల్సి ఉంటుంది. అంతే కాదు కరోనా బారిన పడుతున్న వారి వివరాల సేకరణ, సెకండరీ కాంటాక్ట్‌ లిస్ట్‌ సేకరణ వంటి వివరాలను కూడా కోవిడ్‌ టీం ఇన్‌చార్జిగా ఉన్న ఎస్‌ఐ మాత్రమే సేకరించాల్సి ఉంది. నారాయణగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ప్రస్తుతం కరోనా కొత్త కేసుల సంఖ్య ఎక్కువగా వెలుగు చూస్తుండడంతో వారికి పని భారం ఎక్కువైపోతుంది.

అంతే కాక ప్రతి ఒక్కరి దగ్గరికి ఎస్సైలు వెళ్లి వివరాలు సేకరిస్తుండడంతో ఎవరి నుంచి వైరస్ సోకుతుందో అన్న భయం వారిని వెంటాడుతోంది. ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకుని మరీ కోవిడ్‌ వైరస్‌కు గురైన వారి వద్దకు వెళుతున్నారు. ఒక్క పోలీస్ స్టేషన్ లో ఇద్దరు ముగ్గురు ఎస్సైలు ఉన్నప్పటికీ ఒకరికే ఈ బాధ్యతలు అప్పగించడంతో వారు ఉన్నతాధికారుల మాట ధిక్కరించలేక, తోటి వారితో చెప్పుకోలేక సతమతం అవుతున్నారు. ప్రతి పోలీస్‌ స్టేషన్‌లో కోవిడ్‌ ఇన్‌చార్జిగా విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఐలకు సెలవులు ఇవ్వకుండా అదే పనిగా పనిచేపిస్తే అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని, అందుకే రొటేషన్‌ పద్ధతిలో డ్యూటీలను వేయాలని సెంట్రల్‌ జోన్‌ పోలీసు ఉన్నతాధికారి ఒకరు స్టేషన్‌లోని ఓ అధికారికి చెప్పారు. ఈ వంద రోజుల్లో ఇటు లా అండ్‌ ఆర్డర్‌ విధులు, నైట్‌ డ్యూటీలు, బందోబస్తులు, కోవిడ్‌ టీం బాధ్యతలు చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories