Hyderabad: ఉరి వేసుకున్న యువకుడి ప్రాణం కాపాడిన కానిస్టేబుల్

Hyderabad: అర్ధరాత్రి ఉరివేసుకొని ఆత్మహత్యకు యత్నించిన జగన్‌ అనే వ్యక్తి

Jyothi
Published on: 10 March 2024 12:37 PM IST
Police Constable Saved The Life Of The Hanging Young Man In Hyderabad
X

Hyderabad: ఉరి వేసుకున్న యువకుడి ప్రాణం కాపాడిన కానిస్టేబుల్

Hyderabad: హైదరాబాద్‌ బడంగ్‌పేట కానిస్టేబుల్స్‌ మానవత్వం చాటుకున్నారు. సీపీఐఆర్ చేసి వ్యక్తి ప్రాణాలు కాపాడారు. బడంగ్‌పేటలో అర్ధరాత్రి జగన్‌ అనే వ్యక్తి 100కి కాల్ చేసి ఉరివేసుకుని చనిపోతున్నానంటూ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న కానిస్టేబు‌ళ్లు నారాయణ, నర్సింహా జగన్‌ ఇంటికి చేరుకున్నారు. ఫ్యాన్‌కు ఉరివేసుకున్న జగన్‌ కొనఊపిరితో వేలాడుతూ కనిపించాడు. వెంటనే జగన్‌ను కిందకు దించిన సీపీఆర్‌ చేసి ప్రాణాలు కాపాడారు. మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. జగన్ ప్రాణాలు కాపాడిన కానిస్టేబుళ్లకు జగన్ భార్య, కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Jyothi

Jyothi

Next Story