Hyderabad: గుండెపోటుతో కుప్పకూలిన యువకుడు.. సీపీఆర్‌ చేసి రక్షించిన కానిస్టేబుల్‌..

Hyderabad: హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ఆరాంఘర్‌లో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ మానవత్వం చాటుకున్నారు.

Arun Chilukuri
Published on: 24 Feb 2023 11:59 AM IST
Police Constable Performs CPR and Saves Life in Hyderabad
X

Hyderabad: గుండెపోటుతో కుప్పకూలిన యువకుడు.. సీపీఆర్‌ చేసి రక్షించిన కానిస్టేబుల్‌..

Hyderabad: హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ఆరాంఘర్‌లో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ మానవత్వం చాటుకున్నారు. గుండెపోటుకు గురైన నిండు ప్రాణాన్ని కానిస్టేబుల్ నిలబెట్టారు. ఆరాంఘర్ చౌరస్తాలో గుండెపోటుతో బాలాజీ అనే వ్యక్తి కుప్పకూలాడు. దీన్ని గమనించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్... బాలాజీకి సీపీఆర్ చేసి ప్రాణాన్ని కాపాడారు. బాలాజీని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించిన కానిస్టేబుల్.. అతని ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story