హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్‌ పట్టివేత

హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్‌ పట్టివేత
x
Highlights

హైదరాబాద్‌లో డ్రగ్స్‌ ముఠా గుట్టురట్టు చేశారు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు. సల్మాన్‌, అహ్మద్‌లను అదుపులోకి తీసుకుని వారి నుంచి 200 గ్రాముల ఎండీఎంఏను...

హైదరాబాద్‌లో డ్రగ్స్‌ ముఠా గుట్టురట్టు చేశారు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు. సల్మాన్‌, అహ్మద్‌లను అదుపులోకి తీసుకుని వారి నుంచి 200 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. గోవా నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్‌ తీసుకొస్తుండగా పట్టుకున్నారు. టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగు చూశాయి. ప్రముఖ పబ్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్న సల్మాన్‌ 10 పబ్‌లకు డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. గోవా నుంచి అమ్మాయిలను రప్పించి వారి ద్వారా పబ్‌కు వచ్చేవారికి డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నట్టు వెల్లడైంది. అంతేకాదు అమ్మాయిలతో వ్యభిచారం కూడా నిర్వహిస్తున్నట్టు విచారణలో తేలింది. దీంతో సల్మాన్‌ డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న 10 పబ్‌ల డేటాను సేకరిస్తున్నారు పోలీసులు.

Show Full Article
Print Article
Next Story
More Stories