PPA Meeting: ఈ నెల 29న పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం

PPA Meeting: చేసుకోవాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ ఆదేశాలు

Shekhar G
Updated on: 23 Jan 2024 4:45 PM IST
Polavaram Project Authority  Meeting On 29th Of This Month
X

PPA Meeting: ఈ నెల 29న పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం

PPA Meeting: ఈ నెల 29న పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం జరగనుంది. పోలవరం ప్రాజెక్టు పనులపై రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందాన్ని చేసుకోవాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర జలవనరుల శాఖకు పీపీఏ ముసాయిదా ఒప్పంద ప్రతిని పంపింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మార్పులు సూచించింది. వాటిని కేంద్ర జలశక్తి ఆమోదించలేదు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని పూర్తిగా కేంద్రమే భరిస్తున్నందున షరతులు విధించే హక్కు తమకే ఉంటుందని కేంద్ర జలశక్తి స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కేంద్రం రూపొందించిన ముసాయిదా ఒప్పంద ప్రతిని రాష్ట్ర జల వనరుల శాఖ ఆమోదించాల్సిందేనని కేంద్రం చెబుతోంది. వాస్తవానికి ఈ సమావేశం ఈ నెల 16 జరగాల్సి ఉంది. సంక్రాంతి సందర్భంగా ఈ భేటీ వాయిదా పడింది. పీపీఏ దానిని మళ్లీ 29కి వాయిదా వేసింది.

Shekhar G

Shekhar G

Next Story