కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి

Pocharam Srinivas Reddy: తెలంగాణ మాజీ స్పీకర్‌, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు.

Arun Chilukuri
Updated on: 21 Jun 2024 1:53 PM IST
Pocharam Srinivas Reddy Joined In Congress Party
X

కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి

Pocharam Srinivas Reddy: తెలంగాణ మాజీ స్పీకర్‌, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. శుక్ర‌వారం ఉద‌యం పోచారం ఇంటికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఆయ‌న‌ను కాంగ్రెస్‌లో చేరాల‌ని ఆహ్వానించారు. రేవంత్ ఆహ్వానం మేర‌కు పోచారం, ఆయ‌న కుమారుడు భాస్క‌ర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పోచారం శ్రీనివాస్ రెడ్డికి, భాస్క‌ర్ రెడ్డికి కాంగ్రెస్ కండువా క‌ప్పారు రేవంత్ రెడ్డి.

రైతుల సంక్షేమానికి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఎన్నో సేవలందించారని రేవంత్‌రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం రైతు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని.. ఈ విషయంలో పోచారం సూచనలు స్వీకరిస్తామని చెప్పారు.



Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story