ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణకు ప్రధాని మోడీ.. తెలంగాణపై వరాల జల్లు కురిపించనున్నారా..?

PM Modi Likely to Give Sops to Telangana
x

ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణకు ప్రధాని మోడీ.. తెలంగాణపై వరాల జల్లు కురిపించనున్నారా..?

Highlights

PM Modi Tour: పట్టుబిగించేందుకు ప్రయత్నాలు. ఆపై ముంచుకొస్తు్న్న ఎన్నికలు.

PM Modi Tour: పట్టుబిగించేందుకు ప్రయత్నాలు. ఆపై ముంచుకొస్తు్న్న ఎన్నికలు. ఏం ఇవ్వలేదు.. ఏం చేయలేదంటూ విపక్షాల విమర్శలు. ఇన్ని సందిగ్ధతల మధ్య ప్రధాని మోడీ తెలంగాణ టూర్ సాగనుంది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతున్న కాషాయదళం అందివచ్చిన ప్రతీ అంశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది. అయితే మోడీ పర్యటన తెలంగాణ బీజేపీకి బూస్టప్ కానుందా..? కర్ణాటక మాదిరే తెలంగాణపై సైతం ప్రధాని వరాల జల్లు కురిపించనునున్నారా.? తాయిలాలు ప్రకటించి అధికారపీఠానికి మోడీ బాటలు వేస్తారా..? ఇదే అంశంపై ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

గత నెలలో కర్ణాటకలో పర్యటించారు ప్రధాని మోడీ. కర్ణాటకపై వరాల జల్లు కురింపించారు. దాదాపు 16వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. 8వేల 480 కోట్లతో నిర్మించిన ప్రతిష్టాత్మక బెంగళూరు - మైసూరు ఎక్స్‌ప్రెస్‌వేను మోడీ జాతికి అంకితం చేశారు. 4వేల 130 కోట్లతో నిర్మించనున్న మైసూరు-కుశాల్‌నగర్ హైవేకు శంకుస్థాపన చేశారు. ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో పర్యటించిన మోడీ ఆ రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల పనులను ప్రారంభించారు.

ప్రస్తుతం తెలంగాణలో సైతం ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాని పర్యటన ఖరారైంది. దీంతో తెలంగాణపై మోడీ ఎలాంటి వరాలు కురిపిస్తారన్న చర్చ జరుగుతోంది. తెలంగాణను బీజేపీ అధినాయకత్వం అత్యంత కీలకంగా భావిస్తుడటంతో భారీగా నిధులు విడుదల చేస్తారన్న అంచనాలున్నాయి. ఇప్పటికే తెలంగాణకు మోడీ ఏం చేయడం లేదని బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. ఆ విమర్శలకు చెక్ పెట్టాలంటే కర్ణాటక మాదిరే తెలంగాణకు సైతం భారీ నిధులు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ప్రారంభించే కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను మాత్రమే పీఎంఓ ప్రకటించింది. అవి కాకుండా ఇంకా ఏమైనా ఉండనున్నాయా.? ఉంటే ఎలాంటి వాటికి నిధులు కేటాయిస్తారన్నదానిపై ప్రధాని ప్రసంగం తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories